Ranji Trophy 2026: జమ్మూ కాశ్మీర్ గ్రాండ్ విక్టరీ.. 67 ఏళ్ల తర్వాత  రంజీ ట్రోఫీ కైవసం.. 

Ranji Trophy 2026: జమ్మూ కాశ్మీర్ గ్రాండ్ విక్టరీ.. 67 ఏళ్ల తర్వాత  రంజీ ట్రోఫీ కైవసం.. 

Ranji Trophy 2026: హుబ్లీ వేదికగా జరిగిన రంజీ ట్రోఫీ-– 2026 ఫైనల్ లో జమ్మూ  కాశ్మీర్ టీమ్ కర్ణాటకపై  అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ మెగా టోర్నమెంట్లో జమ్మూ 67 సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.  ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు జరిగిన ఈ నిర్ణయాత్మక పోరులో జమ్మూకాశ్మీర్ జట్టు బ్యాటింగ్,  బౌలింగ్ లో  ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి ఇన్నింగ్స్‌లో జమ్ము టీమ్ 584 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో శుభమ్ పుండిర్ అద్భుత సెంచరీ (121 పరుగులు) కొట్టగా, యావర్ హసన్ (88), సాహిల్ లోత్రా (72), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), కన్హయ్య వాధావన్ (70) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ ఐదు వికెట్లతో రాణించినప్పటికీ, మిగితా బౌలర్లు పెద్దగా ఇంప్యాక్ట్ చూపించలేకపోయారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక టీమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బౌలర్ల ధాటికి కూప్పకూలిపోయింది. కేవలం 293 పరుగులకే కర్ణాటక జట్టు ఆలౌట్ అయింది. కర్ణాటక బ్యాటర్లలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 160 పరుగులతో ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా, మిగతా స్టార్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్ (13), దేవదత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0) దారుణంగా విఫలమయ్యారు. దీంతో జమ్మూ అండ్ కాశ్మీర్ బౌలర్లలో ఆకిబ్ నబీ 5 వికెట్లతో కర్ణాటక బ్యాటింగ్ ని దెబ్బ తీశాడు.

దీంతో మొదటి ఇన్సింగ్స్ లో జమ్మూ అండ్ కాశ్మీర్‌కు 291 పరుగుల భారీ ఆధిక్యం దొరికింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా జమ్మూ బ్యాటర్లు  నిలకడగా ఆడి 4 వికెట్ల నష్టానికి 342 రన్స్  చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా.. ఓపెనర్ ఖమ్రాన్ ఇక్బాల్ 160 పరుగులతో అజేయంగా నిలిచి కర్ణాటక బౌలర్లను ధాటిని ఈజీగా అడ్డుకున్నాడు.  మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన శుభమ్ పుండిర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక హుబ్లీ మైదానంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.